సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ ఉన్నతాధికారి మృతి

సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ ఉన్నతాధికారి మృతి
  • BSR NEWS
  • ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ ప్రమాదం
  • లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టిన పోలీస్ అధికారి
  • దుర్మరణం పాలైన టీజీఎస్పీ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్
  • గతంలో తెలంగాణ సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారామ్
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టడంతో ఒక్కసారిగా కిందికి పడిపోయారు. కింద ఉన్న లిఫ్ట్ పై పడి ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో పోలీస్ అధికారి గంగారామ్ (55) దుర్మరణం పాలయ్యారు. 

    గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.